Header Banner

అరకులోయకు అంతర్జాతీయ గుర్తింపు! చరిత్ర సృష్టించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులు!

  Tue Apr 08, 2025 11:02        India

ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని, ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులు నిర్వహించిన 108 నిమిషాల్లో 108 సూర్య నమస్కారాల కార్యక్రమం ప్రపంచ గుర్తింపును సాధించింది. ఈ చారిత్రాత్మక ఈవెంట్‌లో అరకులోయతో పాటు జిల్లా లోని ఐదు మండలాల నుండి సుమారు 20,000 మంది గిరిజన విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 13,000 మందికి పైగా గిరిజన బాలికలు భాగస్వాములయ్యారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ ఘన కార్య‌క్ర‌మం లండన్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా అధికారికంగా గుర్తింపు పొందింది. అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ ఈవెంట్‌ ఘనంగా నిర్వహించబడింది.

 

ఇది కూడా చదవండి: పోసానికి మరో బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు.. మళ్లీ అరెస్ట్..?

 

ఈ కార్యక్రమాన్ని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి గుమ్మడి సంధ్యారాణి లాంఛనంగా ప్రారంభించారు. లండన్ వరల్డ్ రికార్డ్స్ యూనియన్ మేనేజర్ అలిస్ రేనౌడ్ స్వయంగా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ ఘనత సాధించేందుకు విద్యార్థులు ఐదు నెలలపాటు కఠినమైన శిక్షణ తీసుకున్నారు. ప్రతిరోజూ తెల్లవారు జామున 4 గంటలకే లేచి యోగా, సూర్య నమస్కారాలు మరియు ఇతర ఆసనాల్లో అభ్యాసం చేశారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ల పర్యవేక్షణలో శిక్షణ పూర్తయ్యింది. ఈ కార్యక్రమంలో విద్యార్థుల చిత్తశుద్ధి, శారీరక మరియు మానసిక దృఢత్వం ప్రతిఫలించాయి. జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్, సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్ తదితర అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. విద్యార్థులకు రవాణా, భోజనం, త్రాగునీటి సదుపాయాలు కల్పించడంతో పాటు, డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు సిద్ధం చేసినట్టు కలెక్టర్ తెలిపారు. ఇది గిరిజన విద్యార్థినుల శ్రమ, నిబద్ధత, శక్తి సామర్థ్యానికి ప్రతీకగా నిలిచింది.

ఈ అత్యద్భుత కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన విద్యార్థులు, అధికారులకు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. విద్యార్థుల పట్టుదల, శ్రమ, క్రమశిక్షణ గర్వించదగ్గదని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో కూడా ప్రతిభ వెలుగొందుతుందని ఈ కార్యక్రమం ద్వారా స్పష్టమైందన్నారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆ జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం.. వైసీపీటీడీపీ నేతల మధ్య ఘర్షణ.. కార్ల ధ్వంసం.!

 

వాహనదారులకు కేంద్ర బిగ్ షాక్.. ఓరి దేవుడా.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్డీజిల్ ధరలు.!

 

ఏపీవాసులకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ముఖ్యంగా ఈ మూడు - ప్రతీ నియోజకవర్గంలోనూ.!

 

చేసే సేవకు గుర్తింపు రావాల్సిన వయసులో.. డిప్యూటీ కలెక్టర్‌ మృతి దిగ్భ్రాంతికరం! మంత్రి లోకేష్ ప్రగాఢ సానుభూతి!

 

అన్నమయ్య జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం! డిప్యూటీ కలెక్టర్ మృతి! చంద్రబాబు సంతాపం!

 

జగన్‌కు ఊహించని షాక్‌! కీలక సీనియర్ నేత పార్టీకి గుడ్ బై.. రాజీనామా లేఖతో సంచలనం!

 

వైసీపీకి మరో దిమ్మతిరిగే షాక్! కీలక నేత సోదరుడు అరెస్టు.. ముంబై ఎయిర్‌పోర్టులో పట్టివేత!

 

అమెరికాలో 10 తెలుగు విద్యార్థులకు తృటిలో తప్పిన ప్రమాదం! ఇద్దరు విద్యార్థులకు గాయాలుఐసీయూలో చికిత్స..

 

వైసీపీకి షాక్.. మాజీ మంత్రి తమ్ముడు అరెస్ట్! మరో రెండు కేసులు కూడా.. పోలీస్టేషన్‌లోనే దాడి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Andhrapradesh #WorldHealthDay #SuryaNamaskar #YogaForHealth #TribalPride #WorldRecordAttempt